1920 నుండి ఈ ఐకానిక్ ఔషధం తయారు చేయబడుతుంది. జిందా తిలిస్మాత్ అంటే ఉర్దూలో ‘లివింగ్ మ్యాజిక్’ అని అర్ధం, ఇది అన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స చేయడానికి వినియోగించబడుతుంది.

ఈ చిన్న సీసాలోని ముదురు రంగు ద్రవంతో ఉన్నవి కేవలం ఐదు పదార్థాలు మాత్రమే ఉన్నాయి -అవి యూకలిప్టస్, ఇది ప్రధాన పదార్ధం 70 శాతం ఉంటుంది, మరియు కర్పూరం, మెంతోల్, థైమోల్ మరియు రతంజ్యోత్ ఉంటాయి. (చెట్టు యొక్క బెరడు, ఈ మందుకు ఈ రంగును ఇస్తుంది).

జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారిణి. ఈ మందు ఫార్ములా ను కనిపెట్టింది హకీం మహ్మద్ మొయినుద్దీన్ ఫరూఖి. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లినపుడు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అయితే జలుబు, జ్వరంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు జిందా తిలిస్మాత్ కీలక పాత్ర పోషిస్తుంది.
యునాని వైద్య విధానంలో జిందా తిలిస్మాత్ దివ్య ఔషధం. ఇది సర్వరోగనివారిణి. జిందా తిలిస్మాత్ ఎటువంటి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రతి ఇంటా వినియోగంలో ఉంది. ఇది జలుబు, తలనొప్పి, దగ్గు వల్ల నొప్పులు మరియు శ్వాసకోస సమస్యలకు సర్వరోగనివారిణిగా పనిచేస్తుంది.
జిందా తిలిస్మత్ ఉపయోగాలు
జిందా తిలిస్మత్ – ఒక అద్భుత నివారిణి: జిందా తిలిస్మత్ గత 100 సంవత్సరాలుగా మూలికా ఔషధంగా ఉపయోగించబడుతుంది, ఇది ఎన్నో పరీక్షలను తట్టుకుని సాధారణ రోగాలకు విశ్వసనీయ మూలికౌషధంగా నిలబడింది. జిందా తిలిస్మత్ యొక్క ప్రయోజనాలు & ఉపయోగాలు
- జిందా తిలిస్మత్: అంతర్గతంగా మరియు బాహ్యంగా కూడా ఉపయోగించవచ్చు.
- (1 డ్రాప్ = సుమారు 0.05ml)
ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?
సాధారణ జలుబు, ముక్కు దిబ్బడ & దగ్గు
రోజుకు రెండుసార్లు 10 చుక్కల జిందా తిలిస్మత్ ను తీసుకోండి. మీరు దీనిని నీరు, టీ లేదా కాఫీతో తీసుకోవచ్చు – అలాగే 10 చుక్కల జిందా తిలిస్మత్ ను ప్రతిరోజూ రెండుసార్లు మెడ, ఛాతీ మరియు ముక్కు మీద రాసినా కూడా ఇది సాధారణ జలుబు, ముక్కు దిబ్బడ & దగ్గును దూరం చేస్తుంది.
గొంతు నొప్పి & మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాల కోసం
జిందా తిలిస్మత్ యొక్క 10 చుక్కలను రోజుకు రెండుసార్లు తీసుకోండి. దీనితో పాటు, స్వాబ్ ను జిందా తిలిస్మత్ ముంచి గొంతు లోపలి భాగంలో రాయండి.
కడుపులో ఇబ్బంది లేదా సమస్యలు
అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, త్రేనుపులు మరియు వాంతులు వంటి లక్షణాల కోసం: 1 ఔన్స్ నీటిలో 12 చుక్కల “జిందా తిలిస్మత్”ను కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోండి.
విరేచనాలు (లూస్ మోషన్స్)
12 చుక్కల జిందా తిలిస్మత్ ను 10 గ్రాముల వెన్న లేదా 50 గ్రాముల పెరుగుతో కలిపి ఆహారానికి కనీసం ఒక గంట ముందు రోజుకు రెండుసార్లు తీసుకోండి.

బాహ్య ఉపయోగాలు
పిల్లలలో శ్వాస ఇబ్బంది
2 చుక్కల జిందా తిలిస్మత్ ను 6 చుక్కల తల్లి పాల మిశ్రమంతో కలపి పిల్లవాడికి పట్టాలి, మరియు వెచ్చని వస్త్రంతో కాపడం పెట్టాలి, ఉపశమనం వచ్చే వరకు తరచుగా కాపడం పెట్టాలి. ఈ మోతాదు 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే.
పెద్దలలో శ్వాస ఇబ్బంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసనాళపు వాపు, గొంతు నొప్పి మరియు ముక్కు దిబ్బడ వంటి లక్షణాలకు, దగ్గు మరియు గొంతు నొప్పి విభాగంలో పేర్కొన్న విధంగా జిందా తిలిస్మత్ ను తీసుకోవడంతో పాటు 20 చుక్కల జిందా తిలిస్మత్ ను రెండు గ్లాసుల వేడి నీటిలో కలిపి ఆవిరి పీల్చుకోండి, ఇది మీకు అద్భుతమైన ఉపశమనం ఇస్తుంది.
తలనొప్పి
8 చుక్కల జిందా తిలిస్మత్ ను నుదిటిపై రాయండి. అవసరమైతే రెండు గంటల తర్వాత మళ్ళీ ఇలా చేయండి.
పంటి నొప్పి
“జిందా తిలిస్మత్” లో దూదిని ముంచి పంటి ప్రభావిత భాగంలో ఆ దూదిని ఉంచండి. నొప్పి తగ్గే వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇలా చేయండి.
చెవి నొప్పి
బాధిత చెవిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి (చెవి లోపలికి నీరు పోకుండా చూసుకోండి) మరియు 6 చుక్కల జిందా తిలిస్మత్ ను 6 చుక్కల LUKEWARM కొబ్బరి నూనెతో కలపి, చెవి లో పోసి దూదితో మూసివేయండి.
గమనిక: చెవి స్రవిస్తూ ఉన్నప్పుడు ఉపయోగించకూడదు.
కండరాల నొప్పులు
శరీరంలోని చేతులు, పాదాలు, వీపు, మోకాళ్ళ నొప్పులు ఇలా ఏదైనా నయం చేయగలదు. కొన్ని చుక్కల జిందా తిలిస్మత్ ను ప్రభావిత భాగంలో కొంతసేపు రాయండి మరియు మంచి ఫలితాల కోసం వెచ్చని వస్త్రంతో కాపడం పెట్టండి. నొప్పి దీర్ఘకాలికంగా ఉంటే, జిందా తిలిస్మత్ ను మరియు పారాఫిన్ ను (కిరోసిన్ ఆయిల్) సమాన భాగాలతో కలిపి రోజుకు రెండుసార్లు ఉదయం మరియు సాయంత్రం రాయండి, వెచ్చని వస్త్రం తో కాపడం పెట్టి ఆ వస్త్రాన్ని కట్టు కట్టండి.
దురద & తామర
3 లేదా 4 చుక్కల జిందా తిలిస్మత్ ను పెట్రోలియం జెల్లీ / ఎమోలియంట్ లేదా మాయిశ్చరైజింగ్ క్రీమ్‌తో కలిపి రాస్తే తక్షణ ఉపశమనాన్నిఇస్తుంది.
గమనిక: జిందా తిలిస్మత్ గర్భధారణ సమయంలో మరియు తల్లి పాలిచ్చేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు.
Disclaimer – సమస్య మరింత పెరుగుతున్న మరియు సమస్య నయం కాకపోయినా, ఆ సమస్యకు సంబందించిన డాక్టర్ ని మాట్లాడటం లేదా కలవమని మేము సలహా ఇస్తున్నాము.
జిందా తిలిస్మత్ లో ఉపయోగించే ముఖ్య పధార్దాలు
యూకలిప్టస్ ఆయిల్
యూకలిప్టస్ ఆయిల్ (EO), ఇది యూకలిప్టస్ ఆకు నుండి తీస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్ చర్యలతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఆయిల్ వైరస్, బ్యాక్టీరియా, ఈస్ట్‌లు మరియు ఫంగస్ లకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఉదాహరణకు, పీరియాంటైటిస్ మరియు ఇతర దంత వ్యాధులకు కారణమయ్యే పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్ మరియు S. మ్యూటెంట్ బాక్టీరియాకు ఇది వ్యతిరేకంగా పని చేస్తుంది.అందువల్ల, ఇది నోటి పరిశుభ్రత కోసం ఉత్పత్తులలో ఉపయోగించబడింది.
మెంథాల్
మెంథాల్ లో ఏనస్థిషియా మరియు యాంటీ ఇర్రిటంట్ లక్షణాలను కలిగి ఉంది. మెంతోల్ లో ఉండే లక్షణాల వల్ల ఇది చర్మంపై దురద నుండి ఉపశమనం ఇచ్చి,హాయి అనుభూతిని అందిస్తుంది. అలాగే, ఇది గొంతు గరగర తగ్గించి ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం ఇస్తుంది. కండరాల నొప్పి నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.
వికారం, కొలొనోస్కోపీ సమయంలో ప్రేగు మెలి తిరిగినప్పుడు మరియు ప్రేగు వ్యాధికి చికిత్స చేయడానికి పిప్పరమింట్ నూనెలో ఉండే మెంథాల్ చాల ఉపయోగపడుతుంది.
థైమోల్
థైమోల్, థైమ్ నూనె నుండి సేకరించబడుతుంది. థైమ్ నూనె వమ్ము నుండి తీస్తారు. ఇది వివిధ హృదయ, నాడీ, కీళ్ళ నొప్పులు, జీర్ణశయాంతర, జీవక్రియ మరియు ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా ఇది ఉపయోగపడుతుంది.
కర్పూరం
ఇది ఆసియాలో కనిపించే పెద్ద వృక్షమైన క్యాంఫర్ లారెల్ కలప నుండి లభిస్తుంది.
కర్పూరం యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటికోసిడియల్, యాంటీ నోకిసెప్టివ్ మరియు యాంటిక్యాన్సర్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది.దీనికి తోడు చర్మ వ్యాధులకు ఉపయోగించబడుతుంది.
ఆల్కన్నా టింక్టోరియా
ఆల్కన్నా టింక్టోరియా, ఈ మొక్క బోరేజ్ జాతికి చెందినది. ఈ ఆల్కన్నా రూట్ రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆల్కనెట్ రూట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి ఎముకలు మరియు కండరాల వాపును నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది చర్మ గాయాలు మరియు వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించబడుతుంది. మౌఖికంగా, ఆల్కన్నా రూట్ విరేచనాలు మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లకు ఉపయోగించబడుతుంది అలాగే ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంది.
ఈ విధంగా జిందా తిలిస్మత్ ఎన్నో రకాల వ్యాధులకు ఔషధం గా ఉపయోగించడం జరుగుతుంది.
-
Zinda Tilismath 15MLProduct on sale₹320.00 – ₹24,000.00
-
Zinda Tilismath 10MLProduct on sale₹220.00 – ₹899.00
-
Zinda Tilismath 5MLProduct on sale₹130.00 – ₹29,250.00